ఆర్‌వీఆర్‌జేసీకి ‘నాక్‌ ఏ ప్లస్‌’ గ్రేడ్‌ ప్రదానం
logo
Published : 23/06/2021 06:12 IST

ఆర్‌వీఆర్‌జేసీకి ‘నాక్‌ ఏ ప్లస్‌’ గ్రేడ్‌ ప్రదానం

ధ్రువపత్రాన్ని చూపుతున్న కళాశాల కార్యదర్శి రాయపాటి గోపాలకృష్ణ

చౌడవరం (గ్రామీణ గుంటూరు), న్యూస్‌టుడే: గుంటూరు గ్రామీణ మండలంలోని ఆర్‌వీఆర్‌జేసీ కళాశాలకు నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌ (నాక్‌) ఏ ప్లస్‌ గ్రేడ్‌ ప్రదానం చేశారు. ఈమేరకు ఆ కళాశాల ప్రిన్సిపల్‌ కొమ్మినేని రవీంద్ర మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 17, 18 తేదీల్లో నాక్‌ ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల పీర్‌ కమిటీ తమ కళాశాలను సందర్శించినట్లు ఆయన తెలిపారు. డిపార్ట్‌మెంటు స్థాయిలో బోధన సిబ్బంది, వివిధ మౌలిక వసతులు, విద్యా బోధన పద్ధతులపై అధ్యయనం చేసిన కమిటీ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో 22న బెంగళూరులోని నాక్‌ కార్యాలయం తమ కళాశాలకు ఏ ప్లస్‌ గ్రేడ్‌ ధ్రువపత్రాన్ని పోస్ట్‌లో అందజేసినట్లు ఆయన అందులో పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని