ఈ ఇంటిని తరలించొచ్చు
logo
Published : 23/06/2021 06:12 IST

ఈ ఇంటిని తరలించొచ్చు


లేఅవుట్‌లో నిర్మించిన ఇల్లు

వినుకొండ, న్యూస్‌టుడే : ఈ ఫొటోలో రంగు రంగులతో ఉన్న ఈ ఇల్లు పునాది తీసి ఇటుకతో గోడలు, ఇనుముతో పైకప్పు కాంక్రీట్‌ వేసింది అనుకుంటే పొరపాటే. ఇనుము, చెక్కతో రెడీమెడ్‌గా 12+36 అడుగుల పరిమాణంలో అన్ని వసతులతో నిర్మించిన కదిలే ఇల్లు ఇది. వినుకొండ శివారులోని బ్రాహ్మణపల్లె వద్ద ఓ స్థిరాస్తి వ్యాపారి తన కార్యాలయం కోసం తన లేఅవుట్‌లో ఇలా ఏర్పాటు చేశారు. చుట్టూ నాలుగు కమ్మీలపైన ఇనుముతో కట్టారు. వేడిని తగ్గించేందుకు లోపల భాగంలో చెక్క ఈ రెండింటి మధ్య మందపాటి ఫోమ్‌ అమర్చారు. వరండా, హాల్‌, లోపల అటాచ్డ్‌ బాత్‌రూంతో కలిపి బెడ్‌రూం ఏర్పాటు చేశారు. దానికి ఏసీ బిగించారు. హైదరాబాద్‌కు చెందిన కార్మికులు 15 రోజుల్లో దీన్ని నిర్మించగా మొత్తం ఖర్చు రూ.8.50 లక్షలు అయినట్లు తెలిపారు. ఇప్పుడు మరో స్థిరాస్తి వ్యాపారికి దాన్ని విక్రయించినట్లు పేర్కొన్నారు. అక్కడి నుంచి ఈ ఇంటిని మరో చోటికి క్రేన్‌తో పొడవాటి ట్రాలీలో ఎక్కించి తరలించే ప్రయత్నంలో ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని