కారుణ్య నియామకాలు చేపట్టాలి
logo
Published : 23/06/2021 05:59 IST

కారుణ్య నియామకాలు చేపట్టాలి

గుంటూరు(జిల్లాపరిషత్‌), న్యూస్‌టుడే: రాష్ట్రంలో కరోనాతో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఉపశమనం కల్పించేలా కారుణ్య నియామకాలకు అవకాశం కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ఏపీ పంచాయతీరాజ్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. ఆయన సీఎంకు రాసిన లేఖను పత్రికలకు మంగళవారం విడుదల చేశారు. కొవిడ్‌-19తో మరణించిన ఉద్యోగులకు రూ.25 లక్షల పరిహారాన్ని విడుదల చేయాలన్నారు. పంచాయతీరాజ్‌ శాఖలో పోస్టులు ఖాళీలు లేకపోవడంతో కొవిడ్‌ బాధిత ఉద్యోగుల కుటుంబాలకు ఉపాధి కల్పించేందుకు వీలుగా జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులను సూపర్‌ న్యూమరీ ప్రాతిపదికన జిల్లాపరిషత్తులకు మంజూరు చేయాలని కోరారు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని