ఏపీపీఎస్సీ ఉద్యోగ కాలమానిని కొత్తగా ఇవ్వాలి : ఏబీవీపీ
logo
Published : 23/06/2021 05:59 IST

ఏపీపీఎస్సీ ఉద్యోగ కాలమానిని కొత్తగా ఇవ్వాలి : ఏబీవీపీ

హోం మంత్రి సుచరితకు వినతిపత్రం అందజేస్తున్న ఏబీవీపీ నాయకులు

నగరపాలక సంస్థ(గుంటూరు), న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఏపీపీఎస్సీ ఉద్యోగ కాలమానిని రద్దు చేసి ఖాళీగా ఉన్న పోస్టులన్నింటిని కలిపి కొత్తగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు రాష్ట్ర కార్యసమితి సభ్యుడు సాయిచరణ్‌గుప్తా కోరారు. మంగళవారం ఏబీవీపీ నాయకులు రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరితను ఆమె నివాసం వద్ద కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ ద్వారా విడుదల చేస్తామన్న ముఖ్యమంత్రి మాట నిలుపుకోవాలన్నారు. మెగా డీఎస్సీ వెంటనే నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని, పోలీస్‌ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, ఏటా ఉద్యోగ కాలమానిని విడుదల చేయాలన్నారు. జాతీయ కార్యవర్గ సభ్యులు చిన్న శ్రీరామ్‌, ఉపేంద్ర, భరత్‌, భాస్కర్‌, శ్రీను, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని