కుమార్తె వద్దకు వెళ్తూ తండ్రి దుర్మరణం
logo
Published : 23/06/2021 05:59 IST

కుమార్తె వద్దకు వెళ్తూ తండ్రి దుర్మరణం

నాగేశ్వరరావు (పాత చిత్రం)

రెడ్డిగూడెం(రాజుపాలెం) న్యూస్‌టుడే: కుమార్తె వద్దకు వెళ్తూ తండ్రి మృతి చెందిన ఘటన గుంటూరు-మాచర్ల మార్గంలో రెడ్డిగూడెం ప్రధాన కూడలి వద్ద మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు క్రోసూరు మండలం నాగవరం గ్రామానికి చెందిన అల్లం నాగేశ్వరరావు (50) సత్తెనపల్లిలో ఉంటున్న పెద్ద కుమార్తె మల్లేశ్వరి వద్దకు సమీప బంధువైన పులిబండ్ల నాగాంజనేయులుతో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. రెడ్డిగూడెం ప్రధాన కూడలి వద్ద ధూళిపాళ్ల నూలుమిల్లు నుంచి రాజుపాలెం స్పిన్నింగ్‌ మిల్లుకు ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంపై వస్తూ ముందు వెళ్తున్న ఆటోను తప్పించబోయి వారి వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో నాగేశ్వరరావు తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పానగంటి విజయ్‌ (ఫిరంగిపురం మండలం సంక్రాతిపాడు), మీసాల రాకేష్‌ (నాదెండ్ల మండలం గణపవరం), చిన్న (ప్రకాశం జిల్లా) గాయపడ్డారు. రాజుపాలెం పోలీసులు క్షతగాత్రులను సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. విజయ్‌ మినహా మిగిలిన ముగ్గురిని మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు ఎస్సై కలగొట్ల అమీర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శిరస్త్రాణం ధరించకపోవడంతో..: ప్రమాదానికి గురైన ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న ఐదుగురు శిరస్త్రాణం ధరించలేదు. వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో నాగేశ్వరరావు కింద పడటంతో తల రోడ్డుకు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. శిరస్త్రాణం ధరించి ఉంటే ప్రాణహాని ఉండేది కాదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని