వినూత్న బొమ్మలు రూపొందించేలా ప్రేరణ
logo
Published : 23/06/2021 05:59 IST

వినూత్న బొమ్మలు రూపొందించేలా ప్రేరణ

పొన్నూరు, న్యూస్‌టుడే: భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖలోని ‘ఇన్నొవేషన్‌ సెల్‌’ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘టాయ్‌ కాథన్‌ -2021’కు విజ్ఞాన్‌ డీమ్డ్‌ టూ బి యూనివర్సిటీ ఆతిథ్యమిస్తోందని ఉప కులపతి డాక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్‌ మంగళవారం తెలిపారు. మంగళ, బుధవారాల్లో తమ విద్యాసంస్థ నోడల్‌ సెంటర్‌గా సేవలందిస్తుండడం విశేషంగా భావిస్తున్నామన్నారు. భారతీయ నాగరికత, చరిత్ర, సంస్కృతి, పురాణాలతో పాటు వినూత్నమైన ఆటబొమ్మలను రూపొందించేలా యువత ప్రేరణ పొందాలనే ఉద్దేశ్యంతోనే దీన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. భారతదేశాన్ని ప్రపంచ బొమ్మల తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌, ఐక్యూఏసీ డీన్‌ డాక్టర్‌ రామకృష్ణ, ప్రోగ్రాం కోఆర్డినేటర్లు డాక్టర్‌ శివజగదీష్‌కుమార్‌, డాక్టర్‌ సుబ్బారావు, డాక్టర్‌ వేణు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని