‘ఉద్యోగాల భర్తీపై మోసపూరిత ప్రకటనలు’
logo
Published : 23/06/2021 05:59 IST

‘ఉద్యోగాల భర్తీపై మోసపూరిత ప్రకటనలు’

జాబ్‌ క్యాలెండర్‌ ప్రతులను దహనం చేస్తున్న మన్నవ వంశీకృష్ణ తదితరులు

పట్టాభిపురం, న్యూస్‌టుడే: ఎన్నికలకు ముందు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌ రెండేళ్లలో వాలంటీర్‌ పోస్టులు తప్ప నిరుద్యోగులకు ఇచ్చిన ఉద్యోగాలు ఏమీ లేవని గుంటూరు పార్లమెంట్‌ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు మన్నవ వంశీకృష్ణ విమర్శించారు. వైకాపా ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌ ప్రతులను జిల్లా తెదేపా కార్యాలయంలో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు మంగళవారం దహనం చేశారు. అంతకుముందు జాబ్‌ క్యాలెండర్‌ కాపీలతో నిరసన ప్రదర్శన నిర్వహిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వంశీకృష్ణ మాట్లాడుతూ ‘ఉద్యోగాల భర్తీపై వైకాపా ప్రభుత్వ మోసపూరిత ప్రకటనలు, అబద్ధాల క్యాలెండర్‌పై కడుపు మండిన నిరుద్యోగులు రోడ్లు ఎక్కి ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వానికి పట్టడం లేదు. రాష్ట్రంలో 2.30 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే.. కేవలం 10,143 ఉద్యోగాలకు కంటితుడుపుగా నోటిఫికేషన్‌ ఇచ్చారు. 2.59 లక్షల వాలంటీర్‌ ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. మరోవైపు వాలంటీర్‌లు చేసేది సేవ తప్ప ఉద్యోగం కాదని సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారు. రెండేళ్లుగా డీఎస్సీ ప్రకటన లేదు. గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉద్యోగాల నోటిఫికేషన్‌ జాడే లేదు. పోలీస్‌ శాఖలో ఉద్యోగాల భర్తీ లేదు’.. అని దుయ్యబట్టారు. కార్యక్రమంలో టీఎస్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు రాయపాటి అమృతరావు, నరాల నవీన్‌, తొండేపి శాంతి స్వరూప్‌, గంగినేని వాసు, కన్నెధార హరీష్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని