రాష్ట్రానికి 4.12 లక్షల డోసులు
logo
Published : 23/06/2021 05:36 IST

రాష్ట్రానికి 4.12 లక్షల డోసులు

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రానికి మరో 4.12 లక్షల కొవిడ్‌ టీకా డోసులు కేటాయించారు. వీటిలో 3.12 లక్షల కొవిషీల్డ్‌ డోసులు మంగళవారం రాత్రి దిల్లీ నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి. అలాగే హైదరాబాద్‌ నుంచి లక్ష కొవాగ్జిన్‌ టీకా డోలు రోడ్డు మార్గంలో గన్నవరం చేరాయి. వీటిని గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్‌ను తరలించారు. అనంతరం వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు ఆయా జిల్లాలకు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని