AP News: పెనుకొండలో ముగ్గురు వృద్ధుల ఆత్మహత్య!

తాజా వార్తలు

Published : 25/05/2021 12:08 IST

AP News: పెనుకొండలో ముగ్గురు వృద్ధుల ఆత్మహత్య!

పెనుకొండ: అనంతపురం జిల్లా పెనుకొండలోని ఓ ఇంట్లో ముగ్గురు వృద్ధుల మృతదేహాలు లభ్యమవడం కలకలం సృష్టించింది. పట్టణంలోని వేణుగోపాలస్వామి గుడి సమీపంలోని ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో పక్క ఇంట్లో ఉన్న వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇంట్లోకి వెళ్లి చూడగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నమూడు మృతదేహాలను గుర్తించారు. 

మడకశిరలోని ఓ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేసి రిటైరైన అశ్వర్థప్ప(80), తన ఇద్దరు చెల్లెళ్లు వయసు మీద పడడం.. కొవిడ్ సమయం కావడంతో వారికి సహాయం చేసే వారు లేకపోవడంతో ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాల వద్ద ఇంట్లో కీటకాలను చంపేందుకు ఉపయోగించే మందు సీసాలు పడి ఉన్నాయి. కీటకాల మందు తిని ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని