ఆన్‌లైన్‌ తరగతులకు హాజరుకాలేక ఆత్మహత్య

తాజా వార్తలు

Published : 25/06/2020 02:40 IST

ఆన్‌లైన్‌ తరగతులకు హాజరుకాలేక ఆత్మహత్య

తనువు చాలించిన పదో తరగతి విద్యార్థి

గువహటి: స్మార్ట్‌ఫోన్‌ లేకపోవడంతో ఆన్‌లైన్‌ తరగతులకు హాజరు కాలేకపోతున్నాననే మనస్తాపంతో పదో తరగతి చదువుతున్న ఓ బాలుడు(16) ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  ఈ ఘటన అస్సాంలోని చిరంగ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ సుధాకర్‌ సింగ్‌ కథనం ప్రకారం.. ‘ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిది నిరుపేద కుటుంబం. అతడి తల్లి పొట్టకూటి కోసం బెంగళూరు వలసవెళ్లింది. తండ్రి ప్రస్తుతం ఏపని చేయడం లేదు. ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యేందుకు అవసరమైన స్మార్ట్‌ఫోన్‌ తండ్రి కొనివ్వలేకపోయాడు.  దీంతో మనస్తాపం చెందిన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు’ అని వెల్లడించారు. విద్యార్థి వద్ద సూసైడ్‌ నోట్‌ లభించిందన్న వార్తలను పోలీసులు ఖండించారు. 

కరోనా వైరస్‌ వ్యాపించడంతో మార్చి నుంచే అస్సాంలో పాఠశాలలను మూసివేశారు. కానీ, ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. ఈనెల ప్రారంభంలో కేరళలోనూ ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో స్మార్ట్‌ఫోన్‌ కానీ, టీవీ కానీ లేక ఆన్‌లైన్‌ తరగతులకు హాజరు కాలేకపోతున్నానని ఒంటికి నిప్పంటించుకొని తనువు చాలించింది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని