ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత

తాజా వార్తలు

Published : 15/03/2021 01:27 IST

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత

పెనుకొండ: అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భోగ సముద్రం చెరువులో పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు 17మంది పెనుకొండ బాబయ్యస్వామి దర్గాకు వచ్చారు. కుటుంబంలో ఇటీవల ఓ వ్యక్తికి పెళ్లి జరిగింది. బాబయ్యస్వామి దర్శనం అనంతరం కుటుంబ సభ్యులంతా పెళ్లి పూలు  నీటిలో కలిపేందుకు భోగ సముద్రం చెరువు వద్దకు చేరుకున్నారు. చెరువు నీటిలో పెళ్లి పూలు వేస్తుండగా ప్రమాదవశాత్తు అల్లాబకాష్‌(42), అతడి కుమారుడు షేక్‌షావలి(17), కుమార్తె తస్లీమా(14), తోడల్లుడు మహ్మద్‌ సాదిక్‌(40) చెరువులో మునిగిపోయారు. స్థానికులు, బంధువులు చెరువులో గాలించినా వారి ఆచూకీ లభ్యం కాలేదు. 

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని చెరువులో గాలింపు చేపట్టి ఆ నలుగురిని వెలుపలికి తీశారు. అయితే అప్పటికే వారంతా మృతి చెందినట్లు గుర్తించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడటంతో ఆస్పత్రి వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని