ఏటీఎమ్‌లో మంటలు.. 4 మిషన్లు దగ్ధం

తాజా వార్తలు

Published : 10/04/2021 15:33 IST

ఏటీఎమ్‌లో మంటలు.. 4 మిషన్లు దగ్ధం

పామిడి: అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని పామిడి మున్సిపాలిటీ పరిధిలోని ఎస్‌బీఐ ఏటీఎమ్‌లో మంటలు చెలరేగాయి. శనివారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు మంటలను అదుపుచేసేందుకు యత్నించారు. అయితే, పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో అందులోని నాలుగు మిషన్లు కాలి బూడిదయ్యాయి. స్థానికులు శ్రమించి ఎట్టకేలకు మంటలను అదుపుచేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, బ్యాంకు అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని