‘అనంత’లో విషాదం: నలుగురు కొవిడ్‌ రోగుల మృతి!

తాజా వార్తలు

Updated : 04/05/2021 22:08 IST

‘అనంత’లో విషాదం: నలుగురు కొవిడ్‌ రోగుల మృతి!

అనంతపురం: అనంతపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నగరంలోని క్యాన్సర్‌ ఆస్పత్రిలో నలుగురు కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్‌ కొరత వల్లే వారు చనిపోయినట్టు మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న కలెక్టర్‌ గంధం చంద్రుడు, ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిపై సమీక్షిస్తున్నారు. మరోవైపు, మృతుల బంధువులు బోరున విలపిస్తున్నారు. ఆస్పత్రిలో సరైన ఏర్పాట్లు లేవంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని